అర్ధవీడు ఎమ్మార్వో దాసుకు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి..
అర్ధవీడు తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న కుక్కముడి దాసు బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వస్థలమైన మాచర్ల నియోజకవర్గం నుంచి విధులకు హాజరయ్యేందుకు అర్ధవీడుకు వస్తుండగా మార్గం మధ్యలో తహసిల్దార్ కె దాసు గుండెపోటుకు గురయ్యారు. వారి మృతి పట్ల గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో వారి స్వస్థలమైన రచ్చమల్లు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో పాటు భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఇరువురు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బేస్తవారిపేట మండల మాజీ వైస్ ఎంపీపీ బల్లాని సుబ్బరత్నం.తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. డాక్టర్. వేషపోగు బాలు. టీడీపీ యువ నాయకుడు వేష పోగు భరత్ చంద్ర. మరియు బహుజన పరిరక్షణ సమితి నాయకులు. దాసరియోబు తదితరులు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.