చింతపల్లి :-
చింతపల్లి మండలం బెన్నావరం పంచాయితీ గొచ్ఛపల్లి గ్రామంలో గత రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ నీ పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు.స్థానిక గ్రామస్తులు పిలుపుమేరకు జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారామ్,స్థానిక పంచాయితీ జనసేన పార్టీ నాయకులు వంతల రాజబాబు, ఉగ్రంగి లక్ష్మణ రావు, కూడ అబ్బాయి దొర స్థానిక గ్రామస్తులు స్వయంగా పరిశీలించి తప్పకుండా అధికారులు ఈ చెక్ డ్యామ్ నీ మరమ్మత్తులు కాకుండా కొత్తగా నిర్మించే ఆలోచన చేయాలని ఎందుకంటే సుమారు మూడు వందల ఎకరాలకు సాగు నీరు అందించే చెక్ డ్యామ్ ఇదేనని ఇప్పుడు సాగు నీరు అందక పగా నీరు వృధాగా పోతుందని వరీ పంట ప్రస్తుతం పొట్టదశకు చేరుకుందని ఈ సమయంలో పుష్కలంగా నీరు అవసరమని అధికారులు తప్పకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాలని వరీ కోతలు అనంతరం శాశ్వత మార్గం చూపాలనితెలిపారు.