పలుమార్లు సీజ్ చేసిన మారని తీరు..
ప్రకాశం జిల్లా కంభం ::అక్కడ మందులు కొంటున్నారా జాగ్రత్త
ఒక వేళ కొంటె మాత్రం తప్పక కాలం చెల్లిన తేదీని గమనించండి కాలం చెల్లి మూడు నెలలు గడుస్తున్న కానీ యదేచ్చగా అమ్మకాలు సాగిస్తున్నారు.ఇదేంటి అని ప్రశ్నిస్తే నా ఇష్టం ఇలానే అమ్ముతా ఏమి చేసుకుంటారో చేసుకోండి డోంట్ కేర్ అంటున్నాడు ఆ మెడికల్ షాపు యాజమాని. ఇది ప్రకాశం జిల్లా కంభం పట్టణము లోని ఓ వర్తకుడి తీరు.
వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా కంభం పట్టణము లోని స్థానిక బస్టాండ్ నందు వద్ద నున్న బాలాజీ మెడికల్ స్టోర్ లో యజమాని వద్ద గురువారం మధ్యాహ్నం కంభం కు చెందిన నయుమ్ అనే వ్యక్తి మందులు కొనగా వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. మందులు తన పాపకు వేసే ముందు చూసుకోగా మూడు నెలల క్రితం కాలం చెల్లినట్లు గమనించి వెంటనే ప్రశ్నించాడు. దీనిపై అడగగా ఏమి చేసుకుంటావో చేసుకో నేను ఎవరికీ భయపడను అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని తెలిపాడు. అయితే గతం లో కూడా ఈ షాపు పలుమార్లు అధికారులు షాపునీ సీజ్ చేయగా, మత్తు పదార్ధాలు విక్రస్తున్నాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.