ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లోని ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశమునకు పగడాల రంగస్వామి ఇన్చార్జి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లోని ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశమునకు పగడాల రంగస్వామి ఇన్చార్జి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఇన్చార్జి గౌతు సత్యేంద్ర బాబు అలాగే జిల్లా అధ్యక్షులు షేక్ సైదా హాజరు కావడం జరిగినది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలో సమావేశం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య అంశం పార్టీ అభివృద్ధి గురించి అలానే మండల కమిటీలు మరియు జిల్లా పార్టీ కమిటీ యొక్క పరిస్థితులు పరిశీలించి.ఈ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు రంగస్వామి పిసిసి ఆదేశాలు మేరకు జిల్లా ఇన్చార్జి గౌతు జితేంద్ర బాబు మరియు జిల్లా అధ్యక్షులుమాట్లాడుతూ రాష్ట్రంలో అంశాల పై మాట్లాడుతూ ఎలక్షన్ నాడు సూపర్ సిక్స్ అనే పథకాల అమలు చేయలేదని చెప్తూ నిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి దేవుడు యొక్క అంశము నిజ నిజాలు తెలియకుండా మాట్లాడటం చాలా దారుణమైన విషయమని చెప్తూ ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఖండిస్తు. హెచ్చరించింది అలాగే త్వరలో సూపర్ సిక్స్ కార్యక్రమంలో అమలు జరగకపోతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీపై నిరసన కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించి మీకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రంగస్వామి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని గతంలో కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలని లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు కావచ్చు ధర్నాలు కావచ్చు దేనికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమంలో మునగనూరు సత్యనారాయణ. జానకి రంగనాయకులు కే గోపాల్ షేక్ జమాల్ .శివ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నవారు.