*బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలుతప్పవు * ప్రకాశం జిల్లా..ఎస్పీ ఏఆర్ దామోదర్..
* హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, అణచివేత నుండి సగర్వంగా సభ్య సమాజంలో తల ఎత్తుకొని బ్రతకాలని ఎస్పీ హిజ్రాలకు ఉద్బోధించారు. కొందరు హిజ్రాలు చేస్తున్న, బలవంతపు వసూళ్లు, అసాంఘిక కార్యకలాపాలు వలన, సభ్య సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూస్తున్నారని, అటువంటి పనులను మానుకుంటే, హిజ్రాలు కూడా సభ్య సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతారని ఎస్పీ వారికి హితబోధ చేశారు. హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యను కల్పించడం, వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలలో బలవంతపు వసూళ్లకు పాల్పడడం, బిక్షాటన పేరుతో అశ్లీలమైన దుస్తులను తొలగించడం వంటి పనుల వలన హిజ్రాల ఆత్మగౌరం దెబ్బతింటున్నదని ఎస్పి పేర్కొన్నారు.