ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా..

👉 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారి సూచనల మేరకు జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో సామూహిక దీపారాధనలు, దైవ ప్రార్థనలు, ప్రత్యేక పూజలు..

👉 పెద్ద సంఖ్యలో హాజరైన నగర, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, పార్టీ శ్రేణులు..

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు నిలువైన తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి కారణంగా అపవిత్రం కావడంతో ఈ తప్పును ఆదిలోనే గుర్తించలేకపోయినందుకు క్షమించు స్వామి అంటూ జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న విషయం విధితమే.. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఈ దీక్షకు ఏలూరు నియోజకవర్గం లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు పార్టీ నాయకులతో కలిసి తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేశారు.. జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో సోమవారము రాత్రి స్థానిక 8 వ డివిజన్ తూర్పు వీధిలోని శివయ్య గుడి సంధులో ఉన్న ఓం నమః శివాయ, శ్రీ రామ మందిరం నందు సామూహిక దీపారాధనలు నిర్వహించారు.. అనంతరం ఆలయ రుత్వికులు, దైవప్రార్థనలు, ఇత్యాది పూజ కార్యక్రమాలను ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు..ఈ సందర్భంగా నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.. కలియుగ దైవం పట్ల భక్తి, హైందవ సంస్కృతి సంప్రదాయాల పట్ల చిత్తశుద్ధి లేని వారిని టిటిడి బోర్డు చైర్మన్లుగా నియమించడంతో ఇలాంటి అపసృతులు చోటుచేసుకున్నాయన్నారు.. జరిగిన తప్పిదాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప పడకుండా వైసిపి నాయకులు ఎదురుదాడికి దిగడం వారి కుచిత బుద్ధికి నిదర్శనం అన్నారు.. సనాతన ధర్మం కోసం తన ప్రాణాన్నైనా అర్పించేందుకు సిద్ధమని చెప్పిన తమ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలోనే తామందరం పయనిస్తామని వారు పునరుద్గాటించారు.. జనసేన పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మూడు రోజులు కూడా మరెన్నో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, ప్రోగ్రామింగ్ కమిటీ అధ్యక్షులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, కోశాధికారి పైడి లక్ష్మణరావు, మీడియా ఇంచార్జీ జనసేన రవి, 1 టౌన్ మహిళ ప్రధాన కార్యదర్శి వెలగా గాయత్రి, తాబేలు హిమబిందు, యడ్లపల్లి మమతా, నాయకులు బోండా రాము నాయుడు,కూనిశెట్టి మురళీకృష్ణ, జగపతి మనోహరం స్వామి, బుధ్ధా నాగేశ్వరరావు,కోలా శివ,ఇద్దుం చిరంజీవి,‌కన్న ప్రసాద్, పవన్, స్వామి, వెంకట రమణ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు జనసైనికులు పెద్ద సంఖ్యలో నగర వాసులు, భక్తులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *