గణపవరం మండలంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో , నల్లి రాకీ బాయ్ , బుర్కా యేసు అధ్వర్యంలో ధర్నా
కార్యక్రమంలో నల్లి రాజేష్ గారు మాట్లాడుతూ
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం ఏలూరుపాడు లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీ ని ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు తొలగించిన విషయం అందరికీ తెలిసిందే ఈ విషయమై గత వారం రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు చేస్తున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తున్న ప్రభుత్వం ఎప్పటికీ పట్టించుకోకపోవడం చాలా దారుణమని రఘురామకృష్ణంరాజును ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ విషయంలో గవర్నర్ కలగజేసుకుని ఆయనపై వేటు వేయాలని ఈ సందర్భంగా మాట్లాడారు ఎమ్మెల్యే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కుల మతాలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నల్లి రాజేష్ కమిటీ జిల్లా కార్యదర్సులు గారపాటి నానాజీ , తండా ఇసాక్ రాజు పాలపర్తి కృపానాథ్ పోనుకుమట్ల వీరస్వామి, మట్ట చంద్రశేఖర్ , గరికి పవన్ చంద్ర, గణపవరం మరియు నిడమర్రు మండలాల సంకు దయాకర్, దాకే ఏసోపు, మండ్ర సురేష్, డొల్ల చిన్ని మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు