గాజువాకలోని శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
పెద్దఎత్తున తరలివచ్చిన స్థానికులు, కూటమి ప్రజాప్రతినిధులు
విశాఖ ఉక్కును కాపాడినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శన.
విశాఖపట్నం: గాజువాక నియోజకవర్గం వీపీయల్ గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీలక్ష్మి ఆండాళ్ సమేత శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజానీకం, కూటమి ప్రజానిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారా లోకేష్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్థానికుల నుంచి మంత్రి లోకేష్ వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. విశాఖ ఉక్కును కాపాడినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ఈ సందర్భంగా విశాఖ వాసులు ప్లకార్డులు ప్రదర్శించారు.