పలు ప్రాంతాల్లో జరిగిన వెయిట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన కోమలి కార్తీక్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

ఏలూరు

జనవరి 27:వివిధ ప్రాంతాల్లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభచూపిన ఎ. కోమల్ కార్తీక్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు.

స్ధానిక కలెక్టర్ గోదావరి సమావేశమందిరంలో సోమవారం జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలోఆయాప్రాంతాల్లోజరిగిన వెయిట్ లిఫింగ్ పాల్గొనిమెడల్స్ పొందిన ఎ. కోమల్ కార్తీక్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

హిమాచల్ ప్రదేశ్ ఈటా నగర్ లో గత డిశంబరు 28 నుండి జనవరి 8వ తేదీవరకు జరిగిన జూనియర్ నేషనల్ ఛాంపియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 310 కేజీల విభాగంలో సరికొత్త జాతీయ రికార్డును కార్తీక్ సాధించారు.

అదే విధంగా 96 కేజీల విభాగంలో సీనియర్ నేషనల్ ఇంటర్ స్టేట్ సిల్వర్ మెడల్ ను కూడా సాధించారు.

పంజాబ్ లో లవ్ లీ ప్రొఫేషనల్ యూనివర్శిటీ లో జనవరి 15 నుండి 18 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా యూనివర్శిటీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ ను సాధించారు.

అదే విధంగా ఖత్తర్ లో ఈనెల 19 నుండి 25 వరకు జరిగిన జూనియర్ ఎషియన్ ఛాంపియన్ షిప్ 96 కేజీల విభాగంలో కార్తీక్ పాల్గొన్నారు.

అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ ఎ. శ్రీనివాసరావు కుమారుడైన ఎ. కోమల్ కార్తీక్ మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా కోమల్ కార్తీక్ ను ప్రోత్సహించిన డిస్ట్రిట్ స్పోర్ట్స్ అథారిటీ కోచ్ ఎం. రమేష్ బాబు, స్టేట్ కార్యదర్శి టి. దీనషబాబు, ఇండియన్ వెయిట్ లిప్టింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకట్రామయ్యలను కలెక్టర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *