పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
కృష్ణంశెట్టి పల్లె పంచాయతీలో రూ. 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ ప్రగతికి అండగా కార్యక్రమాన్ని గిద్దలూరుశాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని కృష్ణంశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. గ్రామ పంచాయతీలోని ఉప్పలపాడు గ్రామంలో రూ. 10 లక్షలు, అక్కలరెడ్డి పల్లె గ్రామంలో రూ.10 లక్షలు, కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో రూ. 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్లకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గ్రామాలలో అభివృద్ధి చేసే దిశగా నేడు తొలి అడుగు పడిందని, గ్రామాల్లో ప్రజలకు కావలసిన అన్నీ సదుపాయాలను, మౌలిక వసతులను కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, గత వైసిపి పాలనలో జరిగిన నష్టాన్ని అధిగమించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వందే అని గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుమల్ల అశోక్ రెడ్డి అన్నారు .