బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా..
9-10-24 న బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ నందు,బడుగు బలహీన వర్గాల కోసం బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చి రాష్ట్రంలో దేశంలో బీసీ కులగణన జరపాలని డిమాండ్ చేస్తూ బీసీల కోసం ధర్నా చౌక్ నందు ధర్నా చేయుటకు ముందుకు వచ్చిన సందర్భంగా మన బీసీ సోదరులంతా బహుజన సమాజ్ పార్టీకి మద్దతు తెలిపి ధర్నా చౌక్ నందు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ,బీసీల యొక్క సమస్యల పైన బీసీ కుల గణన మీద పోరాటానికి కలిసి రావాలని ప్రార్థిస్తున్నాము.,
మన బీసీలంతా గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి కుల గణన మీద ఎన్నో పోరాటాలు చేసాము చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసన శంకరరావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లో , అనేక పోరాటాలు అనేక ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల బీసీ నాయకత్వంతో కలిపి ఢిల్లీ రాజధాని లో పోరాటం చేయడం జరిగింది.అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వా రాజకీయ పార్టీ గాని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు గానీ సరైన స్పందన కనపర్చకపోవడం మనం చూసాం, కానీ బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చి ఈరోజు బీసీల సమస్య మా సమస్య అని వారి భుజస్కందాలపై మేసుకుని ప్రభుత్వాలపైన పోరాటానికి సిద్ధమయ్యారు. ఏ రాజకీయ పార్టీ తీసుకొని అంశాన్ని మనకోసం మన బీసీల కోసం బహుజన సమాజ్ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని భావించి మన బీసీ సోదరులందరూ 9 వ తారీకున జరిగే ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము – మేకా వెంకటేశ్వరరావు గౌడ్ …బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్టీఆర్ జిల్లా…. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.