అన్న క్యాంటీన్ కు 25 వేలు విరాళం అందించిన ఫాతిమా స్వచ్చంద సేవా సంస్థ.
గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి గిద్దలూరు పట్టణంలో నిర్వహించుచున్న అన్న క్యాంటిన్ నిర్వహణకు తమ వంతు సహకారంగా ఫాతిమా స్వచ్చంద సేవా సంస్థ నిర్వాహకులు రూ. 25,000-00 లు అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కు ద్వారా ఎమ్మెల్యే గారికి అందచేశారు. ఫాతిమా స్వచ్చంద సేవా సంస్థ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు నంద్యాల ఖాసీం బి, నంద్యాల నిర్వాహకులు ఖాసీం వలి, ఖాదర్ వలి, ఖాదర్ బాషా, అసన్, దూదేకుల హుస్సేన్, దూదేకుల బుజ్జి, దూదేకుల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.