ఇప్పటిదాకా నిత్యపెళ్లి కొడుకుల బాగోతాలు చూసాం…కానీ ..జిగేల్ రాణి బాగోతాలు చూసి పోలీసులే నివ్వెర పోయారు…పుట్టలో చీమలు బయటకు వస్తున్నట్టు…బయటికి వస్తున్న బాధితులు…
పేరు జాయ్ జెమిమా. వయసు 27ఏళ్లు.
అందమే పెట్టుబడి.. సంపన్న వర్గాలే టార్గెట్.. ముగ్గులోకి దింపడానికో స్కెచ్చు.
ఉన్నదంతా ఊడ్చేసి పరారవడమే బిజినెస్ ట్రిక్.
మొన్న విశాఖలో బైటపడ్డ ఈ హానీ ట్రాప్ దందా.. స్థానికులని బెంబేలెత్తిస్తోంది.
అంతేకాదు మేము ఆ జెమియా బాధితులమేనంటూ పలువురు స్టేషన్‌కు క్యూ కడుతుండటం పోలీసులను షాక్‌కు గురిచేస్తోంది.
ఆ కిలాడీ అరెస్ట్ కావడంతోనే… బాధితులు బయటకొస్తున్నారు.
ఇక కేసును ఫుల్ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు… ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగానే ఈ హనీట్రాప్ ముఠా నెట్‌వర్క్ నడిపిస్తున్నట్లు గుర్తించారు. డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నానంటూ డబ్బున్న యువకులను పరిచయం చేసుకుని ట్రాప్ చేస్తున్నట్లు తెలిపారు. మాయలేడీ వేధింపులు తట్టుకోలేక ఒడిశా పారిపోయానంటూ ఓ బాధితుడు ఆశ్రయించడంతో పోలీసులే బిత్తరపోతున్నారు. బెదిరించిన ప్రతీసారి లక్షల్లో సమర్పించుకున్నానని చెప్పడంతో… ఆమె ఆన్‌లైన్ లావాదేవీలపై నిఘా పెట్టారు. నగదు లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని పలువురు యువకులను కూడా ట్రాప్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులకు విశాఖ సీపీ బాగ్చి సమాచారం అందించారు. నిందితురాలి బ్యాంకు ఖాతాల్లోని క్యాష్‌ను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.
మొత్తంగా… ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టమంటున్నారు పోలీసులు. బాధితులను నుంచి ఎద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని.. మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామంటున్నారు.