ఏలూరు, సెప్టెంబర్, 30 : త్రైమాసిక తనిఖీలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ ను త్రైమాసికంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పరిశీలించవలసి ఉన్నది. తనిఖిలో భాగంగా, ఈవిఎం గోదాము యొక్క తాళములు, CC కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్ ను పరిశీలించి అందులో సంతకం చేశారు. కార్యక్రములో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, TDP, BJP, కాంగ్రెస్, జనసేన పార్టీల యొక్క ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *