ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన ఒద్దెపోగు విజయకుమారి కి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి జియాలజీ విభాగం పరిశోధక విద్యార్థి ఒద్దెపోగు విజయ కుమారి కి డాక్టరేట్ ప్రధానం చేసినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. విభాగ ఆచార్యులు టి. మధు మార్గదర్శకత్వంలో ఇంటిగ్రేటెడ్ హైడ్రోజియోలాజికల్ అండ్ జియోఫిజికల్ స్టడీస్ ఆఫ్ పెద్దవంక వాటర్ షెడ్ ఏరియా గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇండియా అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకు ఒద్దెపోగు విజయ కుమారి కి వర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఆమె భర్త మందా నరేష్ కుమార్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ ఒద్దెపోగు విజయ కుమారి కి శుభాకాంక్షలు తెలియజేశారు.