చట్టాలపై మహిళలకు పూర్తి అవగాహన ఉండాలి… జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పురుషోత్తం కుమార్.
చట్టాలపై అవగాహన ఉండాల్సిన బాధ్యత అందరి పై ఉందని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సి హెచ్ పురుషోత్తం కుమార్ అన్నారు.శనివారం చింతలపూడి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవా ధికర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విధాన్ సే సమాధాన్
మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు.చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి.మధు బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళల హక్కులు,వరకట్న వేధింపు లు,మానవ అక్రమ రవాణా,దాడులు ,ఆస్తి హక్కు తదితర చట్టాలపై న్యాయ వాదులు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సి హెచ్ పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణ కు చట్టాలు చాలా ఉన్నాయి అని,వాటిని తెలుసుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.మహిళలకి అన్యాయం జరిగితే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడం కాకుండా వారికి ఉచింతగా న్యాయ వాది నీ ఏర్పాటు చేస్తారని అన్నారు.విధాన్ సే సమాధ న్ అంటే చట్టం ద్వారా పరిష్కారం అని ,మహిళలు చట్టం దాని అమలుకు ఉన్న మార్గాలు తెలుసుకోవాలని సూచించారు.ముఖ్యంగా గృహింస ,మనోవర్తి కేస్ లు ఎక్కువగా వింటూ ఉంటాం అని , వాటి గురించి పూర్తి గా అవగాహన పెంచుకోవాలని సూచించారు.అనంతరం చింతలపూడి సబ్ జైల్ ను సందర్శించారు.ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్,చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి.మధు బాబు,డి ఎస్ పి యూ.రవి చంద్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.నాగేశ్వర్రావు ,నగర పంచాయతీ కమిషనర్ డి.పావని, ఐ సి డి ఎస్ పి వో మాధవి, లు పాల్గొనగా సభ వ్యాఖ్యాతగా సోషల్ వర్కర్ ఎం డి అక్బర్ అలి , సిఐ రవీంద్ర నాయక్ సబ్ జైల్ సూపరింటెండెంట్ కృపానందంలు పాల్గొన్నారు.