నూజివీడు ఆర్డిఓగా యం. వాణి.
ఏలూరు, అక్టోబరు, 4: నూజివీడు ఆర్డిఓగా నియమితులైన యం. వాణి శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్కను అందజేశారు. గతంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన వాణి నూజివీడుకు బదిలీపై వచ్చారు.