పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
గిద్దలూరు పట్టణంలోని శ్రీ విట్టా సుబ్బరత్నం కళ్యాణం మండపంలో శ్రీ వివేకానంద ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలకు చెందిన 1983-85-88 బ్యాచ్ ల విద్యార్థులు నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారికి మేళాతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వేదిక పై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్న, మన చిన్నతనాన్ని గుర్తు చేసేది స్నేహమేనని, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ ప్రతి యేటా ఆత్మీయ కలయిక ద్వారా చిన్ననాటి మిత్రులందరం ఒక చోట వేదికగా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మిత్రులకు అభినందనలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గోన్న అశోక్ రెడ్డి గారికి మిత్ర బృందం పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద జూనియర్ మరియు డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.