మునగాకు వలన కలిగే లాభాలపై అవగాహన కార్యక్రమం.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని అంగనవాడి సెంటర్ నెంబర్ 8 నందు అంగన్వాడి సూపర్వైజర్ వి. చెంచులక్ష్మి ఆధ్వర్యంలో మునగాకుతో వంటకాలు తయారు చేసి తల్లులకు గర్భవతులకు బాలింతలకు మునగాకు వంటకాల గురించి చెప్పడం జరిగింది. మునగాకు లో వుండె పోషకాల గురించి వివరించడం జరిగింది. మునగాకుతో300 రకాల రోగాలను అరికట్టవచ్చు. ప్రాణాంతకమైన క్యాన్సరు తగ్గించే శక్తి మునగాకు వుంది.క్యారెంట్ తింటే వచ్చి విటమిన ‘A’ మునగాకు తినడం వలన 10 శతం ఎక్కువగా వుంటుంది. ఒక నిమ్మకాయతినడం వలన వచ్చి విటమిన ‘A’ మునగాకు తినడం వలన 5 రెట్లు ఎక్కువగా వుంటుంది. పాలల్లో ఉండే క్యాల్షియం 17 రెట్లు ఎక్కవ క్యాల్షియం మునగాకు లో ఉంటుంది. పెరుగు తినడం వలన వచ్చె ప్రోటీన్ కన్న మునగాకులి 8 రెట్లు ఎక్కువ ఉంటుంది. అరటి పండు తింటె వచ్చి పొటాషియం కన్ని ఎండిన మొనగాకులో 15 శాతం ఎక్కువగా ఉంటుంది మునగాకు తినడంవలన రక్త హీనత, షుగర్ కంట్రోల్ లో వుంటాయి. ఎముకలు బలంగా ఉంటాయి ఈ కార్యక్రమంలో పలు అంగన్వాడీ కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.