విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయలు విరాళమిచ్చిన శ్రీ కృష్ణ దేవస్థాన కమిటీ సభ్యులు
ప్రకాశం జిల్లాగిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డిని పట్టణంలోని శ్రీ కృష్ణ దేవస్థానం కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.. విజయవాడ వరద బాధితులకు ఆలయ కమిటీ సభ్యుల తరుపున తమ వంతు సహకారంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,00000-00 లు, అక్షరాల లక్ష రూపాయలు చెక్కు ద్వారా శాసనసభ్యులు గారికి అందచేశారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు..*
ఈ కార్యక్రమంలో దాతలు బైలడుగు బాలయ్య, బుడతా మధుసూదన్ రావు, నంద్యాల శ్రీనివాసులు, చల్లా రమేష్, మొరస బాల గురవయ్య, యాలగాని వెంకటేశ్వర్లు, దారం గురవయ్య, బోనేని వేణుగోపాల్, ఇరగనబోయిన రవికాంత్, రంపే గంగయ్య, చల్లా రవికాంత్, చల్లా రాజనరసింహ, కుమ్మరి పాండు, చల్లా బాల నరసింహులు, మర్రిబోయిన చంద్రశేఖర్, మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.