స్వర్ణాంధ్ర లక్ష్యంగా 2047 విజన్ డాక్యుమెంట్…

ప్రజా భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్…

దేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలకు రానున్న 25 సంవత్సరాలకాలం ఎంతో గణనీయమైంది, గుణాత్మకమైంది…

భేషుగ్గా జిల్లాస్ధాయి స్వర్ణాంధ్ర @2047 విజన్.. జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి…

ఏలూరు, అక్టోబరు, 4: స్వర్ణాంధ్ర @2047 ఎపి విజన్ అజెండాతో రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు.  స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం రూపకల్పన లో భాగంగా వచ్చే ఐదేళ్లకు జిల్లా స్థాయి దార్శనిక పత్ర రూపకల్పన కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ర్ట గృహ నిర్మాణ శాఖ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో  జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డా.కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు,జాయింట్ కలెక్టర్ పీ. ధాత్రి రెడ్డి  పాల్గొన్నారు.  ఈ సందర్బంగా గౌ. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2047 విజన్ ను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కసరత్తు చేపట్టిందన్నారు.  స్వర్ణాంధ్ర @2047 విజన్ పత్రం అనేది ఆర్ధికాభివృద్ధి, సామాజికాభివృద్ధి, పర్యవరణ, సుస్తిరతలపై దృష్టిసారిస్తూ 2047 నాటికి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ వృద్ధికేంద్రంగా మార్చడానికి కావాల్సిన ప్రణాళిక, కార్యచరణను నిర్ధేశిస్తుందన్నారు.  స్వర్ణాంధ్ర @2047 పత్రాన్ని ఈఏడాది నవంబరు 1వ తేదీన విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.  ఈదీర్ఘకాలిక ప్రయత్నంలో భాగంగా ముందడుగు వేయడానికి రాష్రంలోని అన్ని జిల్లాలు, మండల స్ధాయిలో రాబోయే 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.  రాబోయే రోజుల్లో మనరాష్ట్రం 2029 నాటికి 15శాతం వృద్ధిరేటును, తలసరిమూలధన ఆదాయాన్ని రెండురెట్లు పెంచుకోవాలనే లక్ష్యం పెట్టుకుందన్నారు. స్వర్ణాంధ్ర @2047 విజన్ ను జిల్లాస్ధాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంతోఅద్భుతంగా రూపొందించారన్నారు.  అయితే ఆ విజన్ ను ఆచరణ సాధ్యం చేయడానికి అందరి సమిష్టికృషి ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డా.కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు తదితరులు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగపరచుకోవడంతోపాటు మౌలిక సదుపాయాలు ద్వారా జిల్లా అభివృద్ధికి దోహదపడగలవని అభిప్రాయపడ్డారు. జిల్లా అభివృద్ధిని వేగవంతం చేసి అభివృద్ధి చెందిన జిల్లాగా రూపొందడానికి విలువైన సూచనలు అందజేశారు. జిల్లా ఏయే రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం వుందో గుర్తించి ఆయా రంగాల్లో గల మౌలిక సదుపాయాలు, మెరుగైన రహదారులు కల్పన చాలా అవసరమన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్  పి.ధాత్రిరెడ్డి  మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @2047 దార్శనిక పత్రంపై ప్రజాభిప్రాయ సేకరణలో వక్తలు అవకాశాలను ప్రస్తావిస్తూ దార్శనిక పత్రం రూపొందించడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి విజన్ ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ సదస్సులో ప్రజా ప్రతినిధులు, కొద్దిరోజులు కిందట వివిధ రంగాల ప్రతినిధులు తెలియజేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వానికి మరింత మెరుగైన రీతిలో నివేదిక రూపొందించి జిల్లా విజన్ ను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.
సమావేశంలో డిఎఫ్ఓ రవీంధ్రదామా, సిపివో బి. శ్రీదేవి, ఆర్డిఓలు కె. అద్దయ్య, అచ్యుత అంబరీష్, యం. వాణి,  వివిధ శాఖల జిల్లాఅధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *