మాంసం,మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ మల్లికార్జున….
ప్రకాశం జిల్లా , కంభం సర్కిల్ పరిధిలోని అర్ధవీడు, బెస్తవారిపేట, కంభం పరిసర ప్రాంతాలలో రేపు అక్టోబర్ 2న మాంసం, అక్రమ మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మల్లికార్జున మంగళవారం ప్రజలను హెచ్చరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని కంభం సర్కిల్ పరిధిలో మాంసం, అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలకు సిఐ మల్లికార్జున తెలిపారు.