మహాత్మా గాంధీ 155 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని గాంధీ బజార్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మహిళలు. పూల మాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమం వేల్చూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు. జనసేన నాయకులు. తాటిశెట్టి ప్రసాద్. దాసరి యోబు.
నాయకులు మాట్లాడుతూ భారతదేశపు దిగ్గజా జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ 1869. అక్టోబర్ 2న జన్మించారని. భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆయన చేసిన అసమానతమైన కృషి ని స్మరించుకుంటూ అలాగే బ్రిటిష్ పాలన లో స్వాతంత్రం సాధించుకొనుటకు స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది ప్రాణాలు అర్పించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుంకు సుధాకర్. సాదు ప్రసాదు. కోటేశ్వరరావు. గూడూరు సుబ్బయ్య.మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.