ప్రకాశం జిల్లా కంభం మండలంలో జంగం గుంట్లలో జరుగుతున్నటువంటి పొలం పిలుస్తుంది కార్యక్రమం.
కంభం మండల వ్యవసాయ శాఖ అధికారి డి స్వరూప మరియు శ్వేత ఆధ్వర్యంలో. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతుల మిరప పంటను పరిశీలించారు. మిరప పంటలో వైరస్ రాకుండా వైరస్ ను కలగచేసే రసం పీల్చుపురుగులను నివారించే చర్యలను రైతులకు వివరించారు. ఉదయం ఎర్రబాలెం గ్రామంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పంటలొ నత్రజని ఎరువులు తగ్గించి మూడు దఫాలుగా వేసుకోవాలని వేప పిండి కలిపి వేసుకోవాలని పొలంలో వి టిని ఆరబెట్టాలని తద్వారా చీరపీలను తగ్గించుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు మాధురి హర్షవర్ధని పాల్గొన్నారు.