డిస్ లెక్సియా పై అవగాహన ర్యాలీ.
పిల్లల భాషణ వైకల్యాలపై అప్రమత్తంగా వుండాలనీ, వారిని అర్థం చేసుకుని అండగా నిలవాలని ప్రకాశం జిల్లా కంభం మండల విద్యాధికారి బి.మాల్యాద్రి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం డిస్ లెక్సియా అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలు నూర్జహాన్ మాట్లాడుతూ సాధారణ పిల్లలలో సైతం డిస్ లెక్సియా,డిస్ క్యాలిక్లియా మరియు డిస్ గ్రాఫియా లాంటి వైకల్యాలతో నిర్దిష్ట అభ్యసన సామర్థ్యాలు లేకపోవడాన్ని పాఠశాల స్థాయిలో గుర్తించవచ్చనీ, అటువంటి వారికి ప్రత్యేక బోధన చేయడం ద్వారా వారిలో పురోభివృద్ధి సాధించవచ్చని తెలిపారు.అనంతరం కందులాపురం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి.మాల్యాద్రి, సిఆర్పి మురళీమోహన్, ఉపాధ్యాయులు నూర్జహాన్, శారదాదేవి,సుహాసిని, శరబమ్మ,ఈశ్వరి, కె.కిరణ్ కుమార్, ఖాసింపీరా, వరికుంట్ల.వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్,ఫిజికల్ డైరెక్టర్లు మురళీకృష్ణ,సుబ్రమణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.