సివిల్ సప్లయీస్ ముఠా కార్మికులకు కూలీ రేట్ల అగ్రిమెంట్ ఏరియర్స్ తో కూడిన జీవోను వెంటనే విడుదల చేయాలని,రూటు ఆప్టిమేషన్ రద్దు చేయాలని, పని భద్రత కల్పించాలని,ప్రతి నెల పదో తేదీ లోపు నెల బిల్లులు చెల్లించాలని తదితర డిమాండ్లతో AITUC సివిల్ సప్లయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీఆందోళనలకు పిలుపునివ్వడం జరిగింది. ఆందోళనలో భాగంగా మూడవరోజు (ఈరోజు 27.09.2024శుక్రవారం ) గుంటూరుMLSపాయింట్ లో రెండుగంటలుపనిబంద్ మెరుపుసమ్మె కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న AITUCరాష్ట్రగౌరవ అధ్యక్షులువెలుగురి రాధాకృష్ణమూర్తి , యూనియన్ రాష్ట్రనాయకులు G. సురేష్*బాబు , యూనియన్ రాష్ట్రఉపప్రధానకార్యదర్శి రావులఅంజిబాబు , యూనియన్ జిల్లాఅధ్యక్షులు కోట్ల మరియదాసు , దానం, కాంతారావు, వినుకొండ డేవిడ్, సురేష్, జాన్ బాబు, బుజ్జి, కిరణ్ ,మరియబాబు తదితరులు పాల్గొన్నారు.