ఏలూరు నగరం లో ఈరోజు 1 వ డివిజన్ పరిధిలోని నాగేశ్వర పురంలో శ్రీ లక్ష్మీ గణపతి మహోత్సవములు జరిగిన శుభ సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్డి అప్పలనాయుడు గారు..
అన్నిదానాల్లో అన్నదానం మిన్న అని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు గారు పేర్కొన్నారు. ఏలూరు నగరంలో ఈరోజు శ్రీను & ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో బావి శెట్టి వారి పేట చెరువుగట్టు వద్ద ఉన్న స్థానిక 1 వ డివిజన్ లోని నాగేశ్వర పురంలో వెలసిన శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయం నందు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవములు జరిగిన శుభ సందర్భంగా ఆలయ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన గంగానమ్మ అమ్మవారి మండపం వద్ద శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై రెడ్డి అప్పల నాయుడు గారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఈ రోజు వందలాది మందికి అన్నప్రసాద వితరణ చెయ్యటం మంచి విషయమని అన్నారు. ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు, సేవా దృక్పథం అలవడుతుందని, అన్న ప్రసాద వితరణకు ముఖ్య అతిథిగా మాకు అవకాశమిచ్చిన నిర్వాహకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. వినాయక చవితి నవరాత్రులను ప్రతి ఒక్కరూ భక్తితో జరుపుకుంటూ లోకరక్షణ కోసం పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఎట్రించి కళ్యాణ్,పైలా సత్యనారాయణ,బంటుమిల్లి జగదీష్,రేట్ల సాయి, జనసేన నాయకులు రండీ దుర్గా ప్రసాద్ (బ్రదర్), రెడ్డి గౌరీ శంకర్,జనసేన రవి, నిమ్మల శ్రీనివాసరావు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు, మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..