ఏలూరు నగరపాలక సంస్థ లో కనీస అర్హత లేని ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
సానిటరీ వర్కర్ గా చేరి ఉన్నత అధికారులకు భారీ మొత్తంలో చెల్లించి హెల్త్ అసిస్టెంట్ గా చలామణి అవుతున్న పలువురు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
హెల్త్ ఇన్స్పెక్టర్ గా గుర్తింపు పొంది మూడు నెలల కాల పరిమితి సీనియర్ ఇన్స్పెక్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించాలి.
జనన మరియు మరణ ధ్రువీకరణ పత్రాలలో కనీసం వెరిఫై చెయ్యకుండా పత్రాలు జారీ చేస్తున్న వైనం.
హెల్త్ అసిస్టెంట్ లో ఒక ఉద్యోగుడు అయితే జనన దివీకరణ పత్రములో అవగాహన లేకపోవడంతో తండ్రి పేరు నే మార్చి పత్రాలను అందించిన ఉద్యోగి.
ఈ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా జనన మరియు మరణ దివీకరణ పత్రాలను డోర్ డెలివరీ చేస్తున్నారన్న సమాచారం.
ఇలా డోర్ డెలివరీ చేసుకుంటూ పెద్ద మొత్తంలో కాసులు గుంజుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగులపై గతంలో అనేక ఫిర్యాదులు అందిన అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అవినీతి ఆరోపణలు ఎదురుకుంటూ కనీస అర్హత లేని ఉద్యోగులను నగరపాలక సంస్థ ఉన్నత అధికారులు ఉత్తమ ఉద్యోగుల అవార్డులకు ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదగా గాంధీ జయంతి నాడు అవార్డులు తీసుకోవడం విడ్డూరంగా ఉంది.
నగరపాలక సంస్థ లో ఎంతోమంది ఇన్స్పెక్టర్లు అర్హత కలిగి ఉద్యోగులు గా ఉన్న అర్హత లేని వారినే కొనసాగించడంపై ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అర్హత లేని హెల్త్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.