ఏలూరులో ఈ నెల 29 జాబ్ మేళా
విభిన్న ప్రతిభావంతుల కొరకు ప్రత్యేక జాబ్ మేళా
ఏలూరు, జనవరి, 27: జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఏలూరు ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (SEEDAP),ఏ.పి.ఎస్.ఎస్.డి.సి. మరియు జిల్లా ఉపాధి శాఖలు సంయుక్తంగా విభిన్న ప్రతిభావంతుల కొరకు వివిధ ప్రయివేటు మరియు కార్పొరేట్ రంగాలలో ఉధ్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుటలో భాగంగా ఈనెల 29వ తేదీ బుధవారం స్థానిక YTC (యూత్ ట్రైనింగ్ సెంటర్ ), పెద్ద రైల్వే స్టేషన్ ఎదురుగా, అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక, ఏలూరు నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారని,.
ఆసక్తి వున్న విభిన్న ప్రతిభావంతులు ఈ కార్యక్రమానికి హాజరు అయి వారి అర్హతను బట్టి వారికి ఆసక్తి వున్న సంస్థ నందు ఉధ్యోగ, ఉపాధి పొందగలరని డీఆర్డీఏ పీడీ డా.ఆర్.విజయ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాలో బిగ్ బాస్కెట్, రిలయిన్స్, కళానికేతన్, MCC-CII, E- వింధ్య, అమోజన్ కంపెనీ ల ప్రతినిధులు పాల్గొంటరని, అలాగే సుమారు 200 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ జాబ్ మేళా కు పదవ తరగతి, ఇంటర్, ఐ.టి.ఐ, డిగ్రీ, పి.జి వంటి విద్యార్హతలు ఉండి 19-30 సంII వయసు గల వారు అర్హులని తెలియజేశారు.
ఇతర వివరాలకు 9281097229, 9493482414, 8978524022, 9440042901 ను . ఈ జాబ్ మేళాకు హాజరు అయ్యే అభ్యర్ధులు తమ బయడేటా మరియు సర్టిఫికెట్స్ నకళ్ళ తో హాజరు కావాలని విజయరాజు తెలియజేసారు.