అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో గల తమ్మింగుల పంచాయతీ సచివాలయం డిఎ వంతల ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమానికి జనసేన పార్టీ మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంతల బుజ్జిబాబు మాట్లాడుతూ రాబోయే భవిష్యత్తు తరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఇదేవిధంగా పీఎం జన్మన్ ద్వారా వచ్చిన ఇల్లులను ఆదివాసి గిరిజన మన్య ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆదివాసి గిరిజన గ్రామాలు అనేక రంగాలలో ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, వాటిని అభివృద్ధి పరిచే విధంగానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి వసతి, చెరువుల అభివృద్ధి, చెత్త నుండి సంపదన కేంద్రాల వినియోగంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులను పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. అధికారులు కూడా వైసిపి ప్రభుత్వంలో బాధ్యతారాహిత్యంగా పనిచేశారని ఆరోపించారు. సర్పంచ్ లను వైసీపీ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల్లా మార్చిందని, అయితే కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా పనులను ప్రాధాన్యత కార్యక్రమంలో చేపడుతున్నారని అన్నారు. ప్రతి పనిని ప్రజల సమక్షంలో పనులకు గ్రామ తీర్మానాలు చేసి అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి జరగడం సంతోషకరమని చింతపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ సలిమితి లక్ష్మయ్య, గ్రామ కమిటీ మెంబర్స్, వంతల సందేశ్, కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *