పనిచేసే యంపి పుట్టా మహేష్ కుమార్,పనిచేసే ఎంఎల్ఏ బడేటి చంటి లు ప్రజాప్రతినిధులుగా రావటం ఏలూరు ప్రజల అదష్టం అని రాష్ట్ర కాపుసంక్షేమ సేవాసంఘం అద్యక్షులు పులి శ్రీరాములు అన్నారు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన విజయోత్సవం ఏలూరు రాయల్ స్టార్ ఫంక్షన్ హాలులో పులి శ్రీరాములు అద్యక్షతన జరిగింది.ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎంఎల్ఏ బడేటి చంటి మాట్లాడుతూ తమ తాత తండ్రి చేసిన అభివృద్ధిని రానున్న 5 సంవత్సరాల్లో పూర్తిచేస్తామన్నారు. 15 కోట్ల తో శనివారప్పేట కాజ్ వే స్థానంలో నూతన వంతెన నిర్మిస్తామన్నారు.ఇటీవల జరిగిన వరదల వల్ల నష్టపోయిన వారికి ఏలూరు వాసులు ఒక కోటి రూపాయల విరాళం అందచేశారన్నారు.త్వరలోనే రోడ్ల నిర్మాణం,రిపేర్లు చేయిస్తామన్నారు. కాపుసంక్షేమ సేవాసంఘం తరపున జిల్లా అద్యక్షులు పూజారి నిరంజన్ 50 వేల రూపాయల చెక్కును అన్నా క్యాంటీన్ల కోసం ఎంఎల్ఏ బడేటి చంటి కి అందచేశారు.పేటేటి రామకృష్ణ ప్రసాద్ 10 వేల చెక్కు ను అందచేశారు. యంపి పుట్టా మహేష్ కుమార్ పంపిన సందేశాన్ని పులి శ్రీరాములు సభ్యులకు తేలిపారు. యంపి పుట్టా మహేష్ కుమార్ 100 రోజుల్లో సాధించిన ప్రగతి ని పులి శ్రీరాములు తెలుపుతూ,వర్జీనియా పొగాకు రైతులకు 110 కోట్ల లబ్ది,పోలవరానికి 12,500 కోట్లు, ఏలూరు కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ హాల్టు, జాబ్ మేళా తో 566 మందికి ఉద్యోగాలు,పామాయిల్ రైతుల కు గిట్టుబాటు ధర సాధించారన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యునిగా నియమితులైన కానాల రామకృష్ణ, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం డిప్యూటీ మేయర్ గా ఎంపికైన కర్రి శ్రీనివాసరావు లను సత్కరించారు.సాధారణంగా ప్రభుత్వ విజయాలను,వేడుకలను ఆయా రాజకీయ పార్టీలు నిర్వహిస్తాయి, కాగా సామాజిక వర్గం గా కాపుసంక్షేమ సేవాసంఘ నిర్వహించటం విశేషం. ఈ కార్యక్రమంలో నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్,వాసా రాజు,గాదం వెంకట రామకృష్ణ, సామర్ల వెంకటేశ్వర రావు,కురెళ్ళ భాస్కర రావు,బడే సతీష్ నాయుడు,నిమ్మల జ్యోతికుమార్,సాయి ,పాటే రాంబాబు,లింగిశెట్టి శశికుమార్,నడపన దాన భాస్కర్,వీరంరెడ్డి రమేష్ రావూరి మోహన్ దుర్గా నాయుడు,మరియు యంపి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు-పులి శ్రీరాములు.