రాష్ట్రీయ స్వయంసేవక్ సంగ్ సేవ విభాగము మరియు సేవా భారతి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం.
ఏలూరు జిల్లా ఏలూరు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సేవా విభాగం మరియు సేవా భారతి ఆధ్వర్యంలో సేవా సప్తహము సందర్భంగా ఏలూరు నగరంలో విశేషంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన విశిష్ట వ్యక్తులు కొండపల్లి పరమేశ్వరరావు మరియు తాబేలు హిమబిందు లను సన్మానించుకోవడం జరిగింది.
కొండపల్లి పరమేశ్వరరావు కేబుల్ ఆపరేటర్ గా వ్యాపారం చేస్తున్నారు వీరు ఇప్పటివరకు 58 మంది ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశారు.. వరదల సమయంలో గానీ ఏ విపత్తులు వచ్చినా ఆ ప్రదేశాలకు వెళ్లి అక్కడ వాళ్లకి ఆహార పదార్థాలు మరియు బట్టలు సమకూర్చి ఆపన్నులకు అందజేస్తుంటారు. మరియు తాబేలు హిమబిందు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ట్రూ నాట్, వి ఆర్ డి ఎల్. ల్యాబ్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ లో టీం లీడర్ గా తన ఉద్యోగ బాధ్యతలు పూర్తిగా నెరవేరుస్తూ మరోపక్క చిన్న వయసులోనే గొప్ప సేవా భావం కలిగిన వ్యక్తిగా తన కార్యక్రమాలతో ముందుకు సాగిపోతున్న వీర మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో తను ఏ స్వార్థం చూసుకోకుండా నిస్వార్ధంగా ఎక్కడ అధైర్య పడకుండా… తన సేవా కార్యక్రమాలతో ముందుకు సాగిపోయిన వీర మహిళ. కోవిడ్ బారిన పడిన వారిని పరామర్శించి వారికి ఆహారము మందులు అందజేసిన మానవతావాది. కోవిడ్ సమయంలో రెడ్ జోన్లలో ఉండిపోయిన ఒంటరి మహిళలను, వృద్ధులను,హిజ్రాలను వికలాంగులను గుర్తించి వారికి ఆహారం మరియు 500 కుటుంబాలకు నిత్యవసర సరుకులు మరియు మందులను సమకూర్చి మానవసేవయే మాధవ సేవ అని నిరూపించిన వీర మహిళ.. కోవిడ్ తో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించి తన ప్రాణాలు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఒక ప్రక్క కోవిడ్ ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తూ మరో ప్రక్క సమాజం కోసం తన విలువైన సమయాన్ని కేటాయించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి తాబేలు హిమబిందు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని.. నిర్వహించే సేవా కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని. కోరుకుంటూ..ఈ విధంగా సేవాభావాలు ఉన్న వారిని గుర్తించి ప్రోత్సాహించడంలో భాగంగా ఇరువురిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సేవా విభాగము మరియు సేవా భారతి తరపున విశేషముగా శాలువా కప్పి సత్కరించుకోవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రాంత సేవా ప్రముఖ కేశవయ్య, సంక్షం ఆంధ్ర ప్రాంత సంఘటన కార్యదర్శి కృష్ణమోహన్, ఆంధ్ర ప్రాంత జోష్ ప్రముఖ సత్యనారాయణ, భారతీయ
మజ్దూర్ సంగ్ జిల్లా కన్వీనర్ కాలేశ్వరరావు, ఏలూరు నగర కార్యవాహ పవన్ కుమార్, ఏలూరు జిల్లా కుటుంబ ప్రబోధన్ వెంకటరామయ్య, ఏలూరు నగర బౌద్ధిక్ ప్రముఖు చరణ్ కుమార్, ఏలూరు నగర వ్యవస్థ ప్రముఖ ప్రవీణ్ పాల్గొన్నారు.