ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ AR దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున్ గారు ఈరోజు స్థానికంగా ఉన్న HP పెట్రోల్ బంక్ దగ్గర హెల్మెట్ ధరించాలని
రోడ్డు భద్రతా నియమాలను ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. రహదారులపై ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని, తప్పనిసరిగా ప్రామాణిక కలిగిన హెల్మెట్ ధరించి వాహనం నడపాలని కంభం సిఐ గారు సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఎక్కువ స్పీడ్ తో వెళ్లరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనదారులకు తెలియజేశారు.