అమ్మటానికి వాడెవడు కొనటానికి వీడు ఎవడు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు…
* విశాఖ ఉక్కు ప్రైవేటు కరణ చేయకుండా ఆపాలని కోరుతూ నిరసన కార్యక్రమం*
ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో కందుల అప్పారావు అంబేద్కర్ సర్కిల్ దగ్గర విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమలకు మద్దతుగా సంఘీభావం తెలియజేసిన కంభం పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ కి నివాళులర్పించి న అనంతరము. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికివినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కార్మికులను తొలగించడం విశాఖ ఉక్కు రంగానికి నష్టాలు తెచ్చి పెట్టే విధానాలని మానుకోవాలని ప్రభుత్వం బాధ్యత తీసుకొని లాభాలను వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ అపని పక్షంలో రాష్ట్రవ్యాప్తికంగా ఐక్య ఉద్యమాలు ఉదృతం చేస్తారని ఈ ప్రభుత్వాలను హెచ్చరి హెచ్చరిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమానికి సిఐటియు. మండల కమిటీ అనుబంధ సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని సిఐటియు మండల నాయకుడు షేక్ అన్వర్. కాజా వాలి కార్మిక సంఘా నాయకులు సయ్యద్ కొత్తూరు షేక్ మహబూబ్ బాషా పిక్కిలి.వెంకటేశ్వర్లు. తత్తూరి దానం. ఆటో యూనియన్ నాయకులు ఎం మస్తాన్. ఎన్ శ్రీను. ఎన్ వెంకటేశ్వర్లు. ఎం వెంకటేశ్వర్లు. రాజేశ్వరరావు. గంగయ్య. నాగిరెడ్డి. సత్యం. పి వెంకటేశ్వర్లు. ఉదయ్.ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *